Nandamuri Balakrishna : మరో సినిమాకు ఓకే చెప్పిన బాలయ్య..ఈసారి క్రేజీ కాంబో..దూకుడు పెంచారుగా

టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం​ బాలకృష్ణ జోరు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు. బాలయ్య కోసం క్యూ కడుతోన్న దర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Nandamuri Balakrishna : మరో సినిమాకు ఓకే చెప్పిన బాలయ్య..ఈసారి క్రేజీ కాంబో..దూకుడు పెంచారుగా

Updated on: Dec 18, 2020 | 8:49 AM

టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం​ బాలకృష్ణ జోరు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు. బాలయ్య కోసం క్యూ కడుతోన్న దర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆయన కోసం సంతోశ్​ శ్రీనివాస్‌తో పాటు శ్రీమన్‌ వేముల అనే మరో యంగ్ డైరెక్టర్ కథలు రెడీ చేశారు. ఈ ఇద్దరి కథలకు బాలయ్య ఓకే చెప్పారని తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని చేరినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.

గోపి ఇటీవల బాలయ్యకు స్టోరీ చెప్పారని, త్వరలోనే ఫైనల్‌ స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని మైత్రీ మూవీస్‌ సంస్థలో నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే పునఃప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గోపీచంద్​ మలినేని ప్రస్తుతం మాస్ రాజా రవితేజతో ‘క్రాక్​’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read :

Online Loan Apps : ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేంటి..? యువ ఇంజనీర్‌ను మింగేసిన ఆన్‌లైన్ లోన్ యాప్స్

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు

Loading...
Unable to load recommendations.
Follow Us