ఆ రోజు 47 నిమిషాలపాటు గూగుల్ ఇందుకే నిలిచిపోయింది.. వివరణ ఇచ్చుకున్న అంతర్జాల దిగ్గజం..

|

Dec 19, 2020 | 8:04 PM

సోమవారం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల దిగ్గజం గూగుల్ నిలిచిపోయింది. ఒకటి.. రెండు నిమిషాలు కాదు  47 నిమిషాల పాటు స్తంభించిపోయింది. దీంతో గూగుల్ యూజర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే అంత సమయం పాటు...

ఆ రోజు 47 నిమిషాలపాటు గూగుల్ ఇందుకే నిలిచిపోయింది.. వివరణ ఇచ్చుకున్న అంతర్జాల దిగ్గజం..
Follow us on

సోమవారం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల దిగ్గజం గూగుల్ నిలిచిపోయింది. ఒకటి.. రెండు నిమిషాలు కాదు  47 నిమిషాల పాటు స్తంభించిపోయింది. దీంతో గూగుల్ యూజర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే అంత సమయం పాటు ఎందుకు నిలిచిపోయిందనే అంశంపై సుమారు నాలుగు రోజుల పాటు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ట్విట్టర్ వేదికగా జోకులు.. సెటర్లు.. మీమ్స్ అదిరిపోయాయి.

గూగుల్‌తోపాటు జీమెయిల్, యూట్యూబ్‌లు కూడా మోరాయించాయి. ఈ అంశంపై తాజాగా గూగుల్ యాజమాన్యం స్పందించింది. ఇందుకు కారణాలు వెల్లడించింది. లాగిన్ యూజర్ డేటా తరలించడంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని పేర్కొంది. అక్టోబర్ నుంచి వివిధ సేల్లో లాగిన్ యూజర్లు డేటాను కొత్త ఫైల్స్‌లోకి తరలిస్తోంది. అందులోని డేటా తప్పుగా రిపోర్ట్ చేయడం వల్లే గూగుల్ నిలిచిపోయిందని స్పష్టం చేసింది.