గూగుల్ షాకింగ్ డిసిషన్.. ఇక భారత్‌లో “గూగుల్ స్టేషన్‌”కు స్వస్తి..!

| Edited By:

Feb 18, 2020 | 5:02 AM

గూగుల్ సంస్థ షాకింగ్ డిసిషన్ తీసుకుంది. ఇప్పటి వరకు గూగుల్ స్టేషన్ పేరుతో పలు రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వైఫై సేవలను అందిస్తుంది. ఐదేళ్ల క్రితం భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఈ ఉచిత సర్వీసులను అందజేస్తోంది. అయితే ఇక భారత్‌లో ఈ ఫ్రీ వైఫై సేవలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. దేశంలో ఇంటర్నెట్ ధరలు ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని.. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్‌లలోని ఫ్రీ వైఫై సర్వీసులను తొలగించాలని గూగుల్ […]

గూగుల్ షాకింగ్ డిసిషన్.. ఇక భారత్‌లో గూగుల్ స్టేషన్‌కు స్వస్తి..!
Follow us on

గూగుల్ సంస్థ షాకింగ్ డిసిషన్ తీసుకుంది. ఇప్పటి వరకు గూగుల్ స్టేషన్ పేరుతో పలు రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వైఫై సేవలను అందిస్తుంది. ఐదేళ్ల క్రితం భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఈ ఉచిత సర్వీసులను అందజేస్తోంది. అయితే ఇక భారత్‌లో ఈ ఫ్రీ వైఫై సేవలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. దేశంలో ఇంటర్నెట్ ధరలు ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని.. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్‌లలోని ఫ్రీ వైఫై సర్వీసులను తొలగించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది.

గత ఐదేళ్లలో దేశంలో డాటా ప్లాన్లు అతి తక్కువ ధరలకు లభిస్తున్నాయని.. గూగుల్ వర్గాలంటున్నాయి. దేశంలో సగటున ఓ యూజర్ నెలకు 10 జీబీ డేటా వినియోగిస్తున్నాడని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో “గూగుల్ స్టేషన్”ను ఇంకా కొనసాగించడం అనవసరమని భావిస్తున్నట్టు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ గుప్తా అభిప్రాయపడ్డారు.