సుందర్ పిచాయ్‌కు దక్కిన అరుదైన గౌరవం..

| Edited By: Anil kumar poka

Jun 05, 2019 | 2:10 PM

భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్‌ను యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు 2019కి ఎంపిక చేసింది. యూఎస్‌ఐబీసీ ప్రతీయేటా ఇచ్చే గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2019కి సుందర్ పిచాయ్‌తో పాటు నాస్‌డాక్ అధ్యక్షుడు అడేనా ఫ్రైడ్‌మాన్‌ను ఎంపిక చేసింది. వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అయితే.. తనకు అవార్డును ప్రకటించిన సందర్భంగా సుందర్ పిచాయ్ స్పందించారు. గూగుల్ […]

సుందర్ పిచాయ్‌కు దక్కిన అరుదైన గౌరవం..
Follow us on

భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్‌ను యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు 2019కి ఎంపిక చేసింది. యూఎస్‌ఐబీసీ ప్రతీయేటా ఇచ్చే గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2019కి సుందర్ పిచాయ్‌తో పాటు నాస్‌డాక్ అధ్యక్షుడు అడేనా ఫ్రైడ్‌మాన్‌ను ఎంపిక చేసింది. వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అయితే.. తనకు అవార్డును ప్రకటించిన సందర్భంగా సుందర్ పిచాయ్ స్పందించారు. గూగుల్ కంపెనీకి భారత్ ఎంతో ముఖ్యమైన మార్కెట్ అని, తమ సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తోందని అన్నారు. టెక్నాలజీ అందుబాటులో జీవన విధానం మెరుగుపడిందన్నారు.