మీసేవ ఆపరేటర్లకు గుడ్ న్యూస్

|

May 02, 2020 | 5:11 PM

తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ ఆపరేటర్లకు శుభవార్త తెలిపింది కేసీఆర్ ప్రభుత్వం. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో మీసేవ సెంటర్ల లైసెన్స్ రెన్యువల్ ఫీజు రద్దు చేసింది. దాంతో పాటు 12 వేల రూపాయలు ఒక్క ఆపరేటర్ అకౌంట్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

మీసేవ ఆపరేటర్లకు గుడ్ న్యూస్
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ ఆపరేటర్లకు శుభవార్త తెలిపింది కేసీఆర్ ప్రభుత్వం. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో మీసేవ సెంటర్ల లైసెన్స్ రెన్యువల్ ఫీజు రద్దు చేసింది. దాంతో పాటు 12 వేల రూపాయలు ఒక్క ఆపరేటర్ అకౌంట్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఐదు వేల రూపాయల రెన్యువల్ ఫీజు రద్దు.. మరోవైపు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం.. ఈ రెండు నిర్ణయాలతో మీసేవ ఆపరేటర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది.

12 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని నెలకు వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం తిరిగి తీసుకునే విధంగా ఒప్పందం చేసుకుంటారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5300 మంది మీ సేవా ఆపరేటర్‌లకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై టిఎంఓయు నేతలు, మీసేవ ఆపరేటర్ల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.