సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు

|

Oct 31, 2020 | 2:17 PM

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ స్వీటు షాపు యజమాని కొత్త రకం స్వీటును తయారు చేశాడు.  చాందీ పడ్వో పండుగకు ముందు సదరు స్వీటు షాపు యజమాని...

సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు
Follow us on

Surat new sweet costs nine thousands per kilogram: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ స్వీటు షాపు యజమాని కొత్త రకం స్వీటును తయారు చేశాడు.  చాందీ పడ్వో పండుగకు ముందు సదరు స్వీటు షాపు యజమాని కొత్త రకం స్వీటును అమ్మకానికి పెట్టాడు. ఇందులో వింతేముంది ? అనుకుంటున్నారా ? ఖచ్చితంగా వుంది.

ఈ కొత్త రకం స్వీటును గోల్డు (బంగారం)తో తయారు చేశాడు. అందుకే దాని పేరు గోల్డ్ ఘరీ (గోల్డ్ స్వీటు)ను నామకరణం చేశాడు. దాని ఖరీదు చూస్తే మరింత షాక్ కొట్టక మానదు. గోల్డ్ ఘరీ స్వీటు కిలో ఖరీదు ఏకంగా 9 వేల రూపాయలు.

రోహన్ అనే స్వీటు షాపు యజమాని సాధారణంగా స్వీట్ ఘరీ పేరిట స్వీటును తయారు చేస్తాడు. కానీ ఈసారి వెరైటీగా చేద్దామన్న ఉద్దేశంతో గోల్డ్ ప్లేటెడ్ ఘరీ తయారు చేశాడు. దాని పేరు గోల్డ్ ఘరీ అంటూ నామకరణం చేశాడు. సాధారణ స్వీట్ ఘరీని 660 నుంచి 820 రూపాయల వరకు కిలో విక్రయిస్తుండగా.. ఈ కొత్త రకం గోల్డ్ ఘరీ స్వీటును ఏకంగా 9 వేల రూపాయలకు కిలో అమ్మకానికి పెట్టాడు.

ఖరీదెంతైనేం.. స్వీటు ప్రియులు గోల్డ్ ఘరీని కొనేందుకు ఎగబడ్డారు. దాంతో రోహన్ స్వీటు షాపు కొనుగోలుదారులతో కిటకిటలాడింది. శరద్ పూర్ణిమ సందర్భంగా రోహన్ ఈ కొత్తరకం స్వీటును ఇంట్రడ్యూస్ చేయడంతో స్వీటు ప్రియులు ఎగబడ్డారు. తినుబండారాలలో బంగారం వినియోగం అనేది ఆయుర్వేద శాస్త్రంలో ప్రస్తావించబడిందంటున్న రోహన్.. గోల్డ్‌తో రూపొందించిన ఈ స్వీటుకు తొలి మూడు రోజుల్లో పెద్దగా స్పందన లేకపోయినప్పటికీ.. నాలుగో రోజు నుంచి కొనుగోలు దారులు పుంజుకున్నారని తెలిపాడు. చాందీ పడ్వో అనేది సూరత్‌ ప్రతీ ఏటా శరద్ పూర్ణిమ రోజు నిర్వహించుకునే స్థానిక పండుగ.

ALSO READ: పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు

ALSO READ: ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ