అక్షయ తృతీయకు దిగిరానున్న బంగారం, వెండి ధరలు..

| Edited By:

May 01, 2019 | 12:31 PM

అతివలకు అలంకారమైన బంగారం కాస్త దిగొచ్చిందనే చెప్పాలి. బుధవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.32,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర 10 గ్రాములు రూ.30,500లుగా ఉంది. ఇక వెండి కిలో ధర హైదరాబాద్‌లో రూ.38,020లుగా ఉంది. కాగా.. మే నెల మొదటి వారంలో రానున్న అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారం షాపులన్నీ అప్పుడే కళకళలాడుతున్నాయి. అక్షయ తృతీయ రోజు ఒక గ్రాము బంగారాన్నైనా కొంటే లక్ష్మీ దేవి ఇంట్లో […]

అక్షయ తృతీయకు దిగిరానున్న బంగారం, వెండి ధరలు..
Follow us on

అతివలకు అలంకారమైన బంగారం కాస్త దిగొచ్చిందనే చెప్పాలి. బుధవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.32,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర 10 గ్రాములు రూ.30,500లుగా ఉంది. ఇక వెండి కిలో ధర హైదరాబాద్‌లో రూ.38,020లుగా ఉంది.

కాగా.. మే నెల మొదటి వారంలో రానున్న అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారం షాపులన్నీ అప్పుడే కళకళలాడుతున్నాయి. అక్షయ తృతీయ రోజు ఒక గ్రాము బంగారాన్నైనా కొంటే లక్ష్మీ దేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని మహిళల నమ్మకం. దీంతో.. ఆ రోజు బంగారం కొనేందుకు ఇప్పటినంచే తహతహలాడుతున్నారు.