పోలీసుల సోదాల్లో ఆరు కిలోల బంగారం స్వాధీనం… ఎలాంటి పత్రాలు లేక పోవడంతో సీజ్ చేసిన అధికారులు

|

Nov 21, 2020 | 4:59 PM

బెంగళూరు పోలీసులు భారీగా బంగారంను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నగరంలో నిన్న రాత్రి నిర్వహించిన తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరు కిలోల బంగారు ఆభ‌ర‌ణాల‌ను పట్టుకున్నారు.

పోలీసుల సోదాల్లో ఆరు కిలోల బంగారం స్వాధీనం... ఎలాంటి పత్రాలు లేక పోవడంతో సీజ్ చేసిన అధికారులు
Follow us on

Gold Ornaments Seized : బెంగళూరు పోలీసులు భారీగా బంగారంను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నగరంలో నిన్న రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మొత్తం ఆరు కిలోల బంగారు ఆభ‌ర‌ణాల‌ను పట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కేసును రిజిస్ట‌ర్ చేశారు. ఆభ‌ర‌ణాల గురించి ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల‌కు తెలియ‌జేశారు. వెస్ట్ డీసీపీ పోలీసులు ఈ కేసును ప‌రిశీలిస్తున్నారు. ఎటువంటి ప‌త్రాలు లేకుండా బంగారు ఆభ‌ర‌ణాల‌ను తీసుకువెళ్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ బంగారం ఆభరణాలతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు గోల్డ్ జ్యువెలరీ తయారు చేసి.. విక్రయించేవారిగా పోలీసులు గుర్తించారు.

ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరికిపోవడంతో పోలీసులు ప్రత్యేక ద‌ృష్టి పెట్టారు. ఇంత పెద్ద ఎత్తున బంగారం వీరికి ఎక్కడి నుంచి వస్తున్నది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వీరి నుంచి వీటికి సంబంధిన సమాచారం సేకరించే పనిలో పడ్డారు.