నేల చూపులు చూస్తున్న పసిడి ధరలు.. మరోసారి దిగివచ్చిన గోల్డ్‌, సిల్వర్‌ రేట్.. కారణం అదేనా..?

|

Nov 28, 2020 | 8:59 PM

కరోనా వ్యాక్సిన్‌ తయారీ ఊపందుకోవడంతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖంపట్టాయి. ఈ వారంలో అంచనాలకు మించి దిగివచ్చాయి. దాదాపు బంగారం ధర రూ.48,000 పలికితే, వెండి 58,000కు చేరుకుంది.

నేల చూపులు చూస్తున్న పసిడి ధరలు.. మరోసారి దిగివచ్చిన  గోల్డ్‌, సిల్వర్‌ రేట్.. కారణం అదేనా..?
Follow us on

కరోనా వ్యాక్సిన్‌ తయారీ ఊపందుకోవడంతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖంపట్టాయి. ఈ వారంలో అంచనాలకు మించి దిగివచ్చాయి. దాదాపు బంగారం ధర రూ.48,000 పలికితే, వెండి 58,000కు చేరుకుంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8,200కు పైగా తక్కువ ధర పలికింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసిఎక్స్ )లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.411 తగ్గింది. గత రెండు మూడు వారాలుగా పసిడి ధరలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం తర్వాత కొద్ది రోజుల్లోనే రూ.52వేలకు పడిపోయింది. దాదాపు మూడు నెలల పాటు పసిడి రూ.49,500 నుండి రూ.52,000 మధ్య కదలాడింది.

ఇటీవల వ్యాక్సీన్ అనుకూల ప్రకటనల నేపథ్యంలో మరోసారి పతనమయ్యాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8,000కు పైగా తగ్గిన పసిడి ధర ఇటీవలి రూ.52,000తో చూసినా రూ.4,000 తగ్గింది. ఈ నెలలోనే ఈ తగ్గుదల నమోదయింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.411.00 అంటే 0.85శాతం క్షీణించి రూ.48,106 వద్ద ముగిసింది. రూ.48,508.00 వద్ద ప్రారంభమై రూ.48,647.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వెండి ధరలు చాలా రోజుల తర్వాత రూ.58,000 దిగువకు వచ్చాయి.

ఆ తర్వాత పెరుగుదలతో ముగిసింది. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.773.00 అంటే -1.29శాతం తగ్గి రూ.59,100 వద్ద ముగిసింది. రూ.59,507.00 వద్ద ప్రారంభమై, రూ.59,950.00 వద్ద గరిష్టాన్ని, రూ.57,877.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో వెయ్యికి పైగా తగ్గింది. మార్చి ఫ్యూచర్స్ రూ.1,290.00అంటే -2.09శాతం క్షీణించి రూ.60,333 వద్ద ముగిసింది. రూ.61,299.00 వద్ద ప్రారంభమై, రూ.61,493.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,337.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో రూ.1500కు పైగా తగ్గింది.