ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి మెరుపులు

|

Sep 01, 2020 | 11:11 AM

బంగారం మెరుపు ధగధగలు వరుసగా మూడో రోజు కూడా కొనసాగుతోంది. కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ ఫండ్స్‌ తదితర సంస్థలు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో గోల్డ్ కమోడిటీకి మంచి డిమాండ్ ఏర్పడింది.

ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి మెరుపులు
Follow us on

Gold and silver prices : బంగారం మెరుపు ధగధగలు వరుసగా మూడో రోజు కూడా కొనసాగుతోంది. కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ ఫండ్స్‌ తదితర సంస్థలు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో గోల్డ్ కమోడిటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ మరోసారి ధరలు బలపడ్డాయి. ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే ప్రాధాన్యమివ్వనున్నట్లు యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్‌ పేర్కొనడంతో వారాంతాన బంగారం, వెండి ధరలు ఆటుపోట్ల నుంచి బయటపడి పైకి ఎగబాకుతోంది.

గత రెండు రోజుల జోరును కొనసాగిస్తూ బంగారం, వెండి.. ధరలు మంచి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 341 బలపడి రూ. 52,042 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 1,282 ఎగసి రూ. 68,600 వద్ద కదులుతోంది. ఇది ఇలానే కొనసాగితే.. మదుపరులు మంచి లాభాలను మూటగట్టుకునే అవకాశం ఉంది.