తగ్గిన పసిడి మెరుపులు.. ఈ రోజు బంగారం ధర..

|

Sep 09, 2020 | 3:15 PM

పసిడి పడుతూ.. లేస్తోంది. లాక్ డౌన్ సమయంలో పరుగులు పెట్టిన యెల్లో మెటల్.. అన్ లాక్ సమయంలో ఒక రోజు పెరిగి.. మరో రోజు తగ్గుతోంది. ముందురోజు ఒడిదొడుకుల మధ్య దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్లో బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలాపడ్డాయి...

తగ్గిన పసిడి మెరుపులు.. ఈ రోజు బంగారం ధర..
Follow us on

పసిడి పడుతూ.. లేస్తోంది. లాక్ డౌన్ సమయంలో పరుగులు పెట్టిన యెల్లో మెటల్.. అన్ లాక్ సమయంలో ఒక రోజు పెరిగి.. మరో రోజు తగ్గుతోంది. ముందురోజు ఒడిదొడుకుల మధ్య దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్లో బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలాపడ్డాయి. నాలుగు రోజుల నష్టాల నుంచి సోమవారం బయటపడిన పసిడి ధరలు.. మంగళవారం చివర్లో పుంజుకున్నాయి. దీంతో వరుసగా రెండు రోజులపాటు లాభపడ్డాయి. అయితే ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు నీరసించాయి.  వెనకడుగు వేయడంతో దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ అదే స్థితి కనిపిస్తోంది.

ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 228 నష్టంతో రూ. 51,125 వద్ద ట్రేడవుతోంది. ఇది ఇలావుంటే.. వరుసగా రెండో రోజు మంగళవారం పసిడి, వెండి ధరలు ఊపందుకున్నాయి. ఎంసీఎక్స్‌ లో 10 గ్రాముల పసిడి ధర రూ. 288 ఎగసి రూ. 51,353 వద్ద ముగిసింది. ముందుగా 51,406 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,629 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.

ఇక వెండి కేజీ రూ. 146 వద్ద బలపడి రూ. 68,640 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,713 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 66,155 వరకూ నీరసించింది. నాలుగు రోజుల వరుస నష్టాలకు సోమవారం చెక్‌ పడగా.. పసిడి రూ. 387 ఎగసి రూ. 51,065 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో వెండి మరింత అధికంగా రూ. 1,005 జంప్‌చేసి రూ. 68,271 వద్ద స్థిరపడింది.