Cannabis Cultivation In Goa: గంజాయి సాగుకు అనుమతిచ్చిన గోవా ప్రభుత్వం.. కానీ షరతులు వర్తిస్తాయి..

|

Dec 30, 2020 | 7:46 PM

Goa Permission For Cannabis Cultivation: గంజాయి మొక్కలను పెంచడం చట్ట విరుద్ధమనే విషయం మనందరికీ తెలిసిందే. గంజాయి సాగును నిషేధించిన రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. అయితే తాజాగా గోవా ప్రభుత్వం గంజాయి సాగుచేసేందుకు అనుమతిచ్చింది...

Cannabis Cultivation In Goa: గంజాయి సాగుకు అనుమతిచ్చిన గోవా ప్రభుత్వం.. కానీ షరతులు వర్తిస్తాయి..
Follow us on

Goa Permission For Cannabis Cultivation: గంజాయి మొక్కలను పెంచడం చట్ట విరుద్ధమనే విషయం మనందరికీ తెలిసిందే. గంజాయి సాగును నిషేధించిన రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. అయితే తాజాగా గోవా ప్రభుత్వం గంజాయి సాగుచేసేందుకు అనుమతిచ్చింది. అలా అని ఇష్టమున్న రీతిలో పెంచే అవకాశం లేదులేండి. కేవలం ఔషధ ప్రయోజనాల కోసం పరిమిత స్థాయిలో మాత్రమే గంజాయి సాగుచేసేందుకు అనుమతిచ్చారు. ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు బదులుగా అనుమలిచ్చిన్నట్లు గోవా న్యాయశాఖ మంత్రి నిలేష్ కాబ్రాల్ తెలిపారు. న్యాయబద్ధమైన అంశాలను పరిశీలించిన తర్వాతే అనుతులు మంజూరు చేశామని తెలిపారు.
ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి. ఓవైపు డ్రగ్స్ వాడకంపై గోవా పోరాడుతోన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం.. డ్రగ్ కల్చర్ పెరగడానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గోవా కాంగ్రెస్ ప్రతినిధి అమర్నాథ్ పంజికర్ డిమాండ్ చేశారు.

Also Read: APSRTC News Update: ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!