ఆసుపత్రిలో ‘ఫొని’ పుట్టింది

| Edited By:

May 03, 2019 | 4:52 PM

దేశవ్యాప్తంగా ఫొని అల్లకల్లోలం కొనసాగుతోంది. ఈ తుఫాను వలన భారీ గాలులతో కూడిన వర్షాలు పడుతుండగా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కాగా ఈ భారీ తుఫానులో భువనేశ్వర్‌లో ఓ మహిళ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. రైల్వే శాఖలో పనిచేస్తోన్న ఆ మహిళకు ఇవాళ ఉదయం 11.03గంటలకు డెలివరీ అయ్యింది. అప్పుడే పుట్టిన ఆ పాపకు ‘ఫొని’ అని నామకరణాన్ని చేశారు. ప్రస్తుతం తల్లీ, పిల్ల క్షేమంగా ఉన్నట్లు […]

ఆసుపత్రిలో ‘ఫొని’ పుట్టింది
Follow us on

దేశవ్యాప్తంగా ఫొని అల్లకల్లోలం కొనసాగుతోంది. ఈ తుఫాను వలన భారీ గాలులతో కూడిన వర్షాలు పడుతుండగా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

కాగా ఈ భారీ తుఫానులో భువనేశ్వర్‌లో ఓ మహిళ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. రైల్వే శాఖలో పనిచేస్తోన్న ఆ మహిళకు ఇవాళ ఉదయం 11.03గంటలకు డెలివరీ అయ్యింది. అప్పుడే పుట్టిన ఆ పాపకు ‘ఫొని’ అని నామకరణాన్ని చేశారు. ప్రస్తుతం తల్లీ, పిల్ల క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.