ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు.. జీహెచ్ఎంసీలో మేజిక్ ఫిగర్ 102.! మరి విజయం ఎవరిది.?

| Edited By: Ram Naramaneni

Dec 01, 2020 | 6:08 AM

గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. మేయర్ పదవి దక్కాలంటే ఖచ్చితంగా మేజిక్ ఫిగర్ 76ను అందుకోవాలి...

ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు.. జీహెచ్ఎంసీలో మేజిక్ ఫిగర్ 102.! మరి విజయం ఎవరిది.?
Follow us on

గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. మేయర్ పదవి దక్కాలంటే ఖచ్చితంగా మేజిక్ ఫిగర్ 76ను అందుకోవాలి. కానీ 150 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌ అఫిషియో సభ్యులు(ఎంపీలు, ఎం‌ఎల్ఏలు, ఎంఎల్‌సీలు) 52 మందిని కలుపుకుంటే మొత్తం 202 మంది మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 102 అవుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే టీఆర్ఎస్‌కు ఎక్స్ అఫిషియో ఓట్లు 38 ఎక్కువ ఉన్నాయి. దాని బట్టి చూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ మరో 64 డివిజన్లలో గెలిస్తే మేయర్ పదవి దక్కినట్లే. మరి గ్రేటర్ వార్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. కాగా, ప్రచార పర్వం అంతా మరోసారి పరిశీలిస్తే.. పోరు ఖచ్చితంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉండబోతోందని టాక్. ఇరు పార్టీలు ప్రచార ఘటాన్ని అగ్రనేతలతో హోరెత్తించాయి.