జీహెచ్ఎంసీ ఎన్నికలు : చైతన్యపురి డివిజన్ లో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట

| Edited By: Pardhasaradhi Peri

Dec 01, 2020 | 12:05 PM

గేటర్ ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బీజేపీ ,టీఆర్ ఎస్ కార్యకర్తలు మధ్య ఘర్షణలు తలెత్తాయి. తాజాగా చైతన్య పూరి డివిజన్ లో ఓ నేత ఇంట్లో లభించిన మద్యం బాటిళ్లు వివాదానికి కారణమయ్యాయి. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు : చైతన్యపురి డివిజన్ లో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట
Follow us on

గేటర్ ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బీజేపీ ,టీఆర్ ఎస్ కార్యకర్తలు మధ్య ఘర్షణలు తలెత్తాయి. తాజాగా చైతన్యపురి డివిజన్ లో ఓ నేత ఇంట్లో లభించిన మద్యం బాటిళ్లు వివాదానికి కారణమయ్యాయి. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చెరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతలను వదిలేసి పోలీసులు కావాలనే తమపై లాఠీచార్జి చేసి గాయపరిచారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలతో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రంగారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.