GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు : పలు చోట్ల నిర్మానుషంగా పోలింగ్ బూత్ లు..

| Edited By: Pardhasaradhi Peri

Dec 01, 2020 | 10:49 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుంది. పోలింగ్ మొదలై రెండు గంటలు గడుస్తున్నా చాలా చోట్ల పోలీగ్ బూత్ లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు : పలు చోట్ల నిర్మానుషంగా  పోలింగ్ బూత్ లు..
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుంది. పోలింగ్ మొదలై రెండు గంటలు గడుస్తున్నా చాలా చోట్ల పోలీగ్ బూత్ లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పలు చోట్ల బీజేపీ టీఆర్ ఎస్ నేతలు ఘర్షణలకు దిగుతున్నారు. బంజారాహిల్స్‌ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాషాయం కలర్ మాస్క్ లు ధరించిన పోలింగ్‌ ఏజెంట్లు… ఓటర్లను పోలింగ్ సిబ్బంది లోపలి అనుమతించడంలేదంటూ ఆందోళకు  చేపట్టారు. కాషాయ మాస్క్‎లు ధరిస్తే వారికి ఏంటీ ఇబ్బందంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్త పరిచారు. మరో వైపు ఆర్కేపురంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్ స్లిప్పులు ఇచ్చే చోట టీఆర్ఎస్ నేతలు బ్యానర్ పెట్టి ప్రచారం చేయడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐటీ కారిడార్ లో టెకీలు ఎవరు ఓటువేయడానికి ముందుకు రావడంలేదు. అటు పాతబస్తీలోని పోలింగ్ బూత్ లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.