GHMC Election Results: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్ధం.. నగరంలో నిషేదాజ్ఞలు.. ఉత్తర్వులు జారీ..

| Edited By: Shiva Prajapati

Dec 04, 2020 | 6:36 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు‌‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గ్రేటర్‌‌ వ్యాప్తంగా 30 సర్కిళ్లలో కౌంటింగ్ సెంటర్లను,,,

GHMC Election Results: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్ధం.. నగరంలో నిషేదాజ్ఞలు.. ఉత్తర్వులు జారీ..
Follow us on

GHMC Election Results: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు‌‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గ్రేటర్‌‌ వ్యాప్తంగా 30 సర్కిళ్లలో కౌంటింగ్ సెంటర్లను రెడీ చేసింది. 150 వార్డుల ఓట్ల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. 30 కేంద్రాలతో కలుపుకునని 166 కౌంటింగ్ హాల్స్‌‌ను ఎస్‌‌ఈసీ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఓట్ల లెక్కింపు సందర్భంగా నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు.

రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడటం, ఊరేగింపులు, సమావేశాలు, ప్రదర్శనలు లాంటివి నిషేధమని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరూ కూడా చేతిలో కర్రలు, రాళ్లు, ఆయుధాలు కలిగి ఉండకూడదు, ప్లకార్డులు ప్రదర్శించకూడదు, మత విద్వేషాలను రెచ్చగొట్టగూడదని పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు పేర్కొన్నారు. కాగా, ఈ ఉత్తర్వుల నుంచి పారామిలిటరీ, హోం గార్డులు, పోలీసులు, ఎన్నికల సిబ్బందికి మినహాయింపు ఉంటుందన్నారు.