నేరేడ్‌మెట్ డివిజన్‌కు తొలగిన అడ్డంకి.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు

|

Dec 09, 2020 | 6:57 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు కాసేపట్లో మొదలు కానుంది. నిలిచిపోయిన ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు అనుమతించడంతో.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేరేడ్‌మెట్ డివిజన్‌కు తొలగిన అడ్డంకి..  కాసేపట్లో ఓట్ల లెక్కింపు
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు కాసేపట్లో మొదలు కానుంది. నిలిచిపోయిన ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు అనుమతించడంతో.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. ఇదిలావుంటే, జీహెచ్ఎంసీ కౌంటింగ్ సమయంలో స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. బీజేపీ లీగల్ సెల్ ఇంఛార్జీ ఆంటోనీ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. స్వస్తిక్‌ మార్క్‌ కాకుండా ఇతర మార్కులను ఉపయోగించి బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు వేసినప్పుడు ఎన్నికల నియమాలు, 2005 రూల్‌ 51 ప్రకారం రిటర్నింగ్‌ అధికారికి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఎస్‌ఈసీ వివరించింది. దీనిని సమర్థించిన హైకోర్టు వివాదాస్పద ఓట్లను లెక్కించాలని ఆదేశించింది. ఈ మేరకు మిగిలిన 544 ఓట్లను బుధవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ నిర్వహించి తుది ఫలితాన్ని ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.