కోర్టు ఆదేశాలతో మొదలైన రీకౌంటింగ్.. ఉత్కంఠగా మారిన నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం

|

Dec 09, 2020 | 9:26 AM

హైకోర్టు ఆదేశాలతో నిలచిపోయిన నేరేడ్‌మెట్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది. స్వస్థిక్ గుర్తుకు బదులు ఇతర గుర్తు ఉండే ఓట్లను కూడా లెక్కించేందుకు కోర్టు అనుమతినిచ్చింది

కోర్టు ఆదేశాలతో మొదలైన రీకౌంటింగ్.. ఉత్కంఠగా మారిన నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం
Follow us on

హైకోర్టు ఆదేశాలతో నిలచిపోయిన నేరేడ్‌మెట్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది. స్వస్థిక్ గుర్తుకు బదులు ఇతర గుర్తు ఉండే ఓట్లను కూడా లెక్కించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ ఉదయం 9 గంటలకు రీకౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు ఎన్నికల అధికారులు. కోర్టు తీర్పుతో చెల్లని ఓట్లుగా భావించిన వాటిని రీకౌంటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 504 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ అధిక్యంలో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి మెజారిటీ కంటే ఎక్కువ చెల్లని 544 ఓట్లు ఉండడంతో రీకౌంటింగ్‌కు ఆదేశించింది కోర్టు. ఇప్పుడు కేవలం 544 ఓట్లను మాత్రమే అధికారులు లెక్కిస్తున్నారు. మరికాసేపట్లో ఫలితం వెలువడనుంది. నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితంపై టీఆర్ఎస్, బీజేపీ నేతల్లో టెన్షన్ కొనసాగుతుంది.