లాక్‌డౌన్ వేళ.. పేదలు, వలస కూలీల.. ఆకలి తీరుస్తున్న జీహెచ్‌ఎంసి..

| Edited By:

May 04, 2020 | 7:20 PM

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ నేపద్యంలో సకలం మూత పడడంతో నగరంలోని పేదలు, వలస కూలీలు ఆకలి బారిన పడకుండా

లాక్‌డౌన్ వేళ..  పేదలు, వలస కూలీల..  ఆకలి తీరుస్తున్న జీహెచ్‌ఎంసి..
Follow us on

Annapurna Canteen: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ నేపద్యంలో సకలం మూత పడడంతో నగరంలోని పేదలు, వలస కూలీలు ఆకలి బారిన పడకుండా జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో అన్నపూర్ణ కేంటీన్లు వారి ఆకలిని తీరుస్తున్నాయి. ఏఒక్కరూ పస్తులుండ కూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షల మేరకు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు ఇచ్చిన ఆదేశాలతో వలసకార్మికులు, పేదల ఆకలి తీర్చేందుకు జీహెచ్‌ఎంసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

కాగా.. లాక్‌డౌన్‌కు ముందు నగరంలో నిర్వహించిన అన్నపూర్ణ కేంటీన్లను పునరుద్దరించారు. అదే విధంగా అన్ని ప్రాంతాల్లోఅన్నపూర్ణ భోజనం అందుబాటులో ఉండే విధగా రెగ్యులర్‌ కేంద్రాలతో పాటు, మొబైల్‌ అన్నపూర్ణ కేంటీన్ల సంఖ్యను కూడా 342కు పెంచినట్టుఅధికారులు తెలిపపారు. రెగ్యులర్‌, తాత్కాలిక కేంద్రాల ద్వారా సోమవారం ఒక్క రోజే 1,56,350 మందికి ఆహారాన్ని అందించినట్టుఅధికారులు వెల్లడించారు.