అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో కర్ఫ్యూ

|

Jun 01, 2020 | 10:45 AM

అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది. అట్లాంటా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు కొత్త రగడ చుట్టేసింది. తాజాగా…నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీసు తొక్కి చంపిన ఘటనపై నిరసనలు అమెరికా అంతటా విస్తరిస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఆందోళనలు దేశ రాజధాని వాషింగ్టన్‌కు వ్యాపించాయి. ఆదివారం సాంయత్రం అధ్యక్ష భవనం వద్ద నిరసన కారులు గుమికూడారు. దీంతో వాషింగ్టన్‌లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కొలంబియా మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ తెలిపారు. […]

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో కర్ఫ్యూ
Follow us on

అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది. అట్లాంటా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు కొత్త రగడ చుట్టేసింది. తాజాగా…నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీసు తొక్కి చంపిన ఘటనపై నిరసనలు అమెరికా అంతటా విస్తరిస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఆందోళనలు దేశ రాజధాని వాషింగ్టన్‌కు వ్యాపించాయి. ఆదివారం సాంయత్రం అధ్యక్ష భవనం వద్ద నిరసన కారులు గుమికూడారు. దీంతో వాషింగ్టన్‌లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కొలంబియా మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ తెలిపారు. కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా నిరసనకారులు విధ్వంసాన్ని కొనసాగిస్తుండడంతో.. మిన్నెసొటా, కాలిఫోర్నియా, జార్జియా, ఓహియో తదితర 11 రాష్ట్రాల్లో నేషనల్‌ గార్డ్‌ రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద కూడా జాతీయ సైన్యం అప్రమత్తమైంది. శాన్‌ఫ్రాన్సిస్కో, అట్లాంటా, లూయి‌సవిల్లె, లాస్‌ ఏంజెలెస్‌, పోర్ట్‌లాండ్‌, కొలంబియా తదితర 25 నగరాల్లో కర్ఫ్యూలు విధించారు.