పంజాబ్ గెలుపు వెనుక వారున్నారు…

|

Oct 26, 2020 | 7:01 PM

ఐపీఎల్ 2020 ఫస్టాఫ్‌లో ఘోరంగా విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... సెకండాఫ్‌లో దూకుడుమీదుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్తోంది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ల్లోనూ ఆఖరి బంతి వరకు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించి విజయాలను సొంతం చేసుకుంటోంది.

పంజాబ్ గెలుపు వెనుక వారున్నారు...
Follow us on

Gavaskar Praised : ఐపీఎల్ 2020 ఫస్టాఫ్‌లో ఘోరంగా విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్… సెకండాఫ్‌లో దూకుడుమీదుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్తోంది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ల్లోనూ ఆఖరి బంతి వరకు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించి విజయాలను సొంతం చేసుకుంటోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆకట్టుకునే ప్రదర్శనకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీతోపాటు.. కోచ్ అనిల్ కుంబ్లే పోరాడేతత్వం కారణమని  క్రికెటర్ దిగ్గజం కామెంటేటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. పంజాబ్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించాడు.

గెలిచే దారిని పంజాబ్ వెతుక్కుంది. టోర్నీ మొదట్లో వారు విజయాలను సాధించడంలో వెనకబడ్డారు. ప్రతిసారి విజయానికి చేరువగా వచ్చి ఓటమి చవిచూశారు. తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఓడారు. తర్వాత చివరి ఓవర్లలో పరాజయం పాలయ్యారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో వారు అద్భుతంగా రాణిస్తున్నారు. శనివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులే చేసిన పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించడం సంచలనం అని గావస్కర్ అభిప్రాయ పడ్డారు. జట్టును రాహుల్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా రాహుల్ ఎదిగాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో, బౌలింగ్ మార్పు విషయంలో.. రాహుల్ రాటుదేలాడు.

పంజాబ్ విజయాల్లో అనిల్ కుంబ్లే పాత్రను మరవొద్దని సన్నీ కామెంట్ చేశారు. క్రికెట్ కెరీర్ మొత్తం అతడు పోరాడుతున్నాడని ప్రశంసించారు. దవడకు దెబ్బతగిలినా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగాడు. అదే ధీరత్వం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో కనిపిస్తోంది. వీరిద్దరి వల్లే అసాద్యమనుకున్న పరిస్థితుల్లో పంజాబ్ పుంజుకుంది. ప్లేఆఫ్స్ రేసులోనూ నిలిచిందని గవాస్కర్ కొనియాడాడు.