ఏపీలో మళ్లీ గ్యాస్ లీకేజీ కలకలం.. భయాందోళనలో స్థానికులు..

| Edited By:

Jun 01, 2020 | 11:47 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. ఇటీవల చోటుచేసుకున్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన

ఏపీలో మళ్లీ గ్యాస్ లీకేజీ కలకలం.. భయాందోళనలో స్థానికులు..
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. ఇటీవల చోటుచేసుకున్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ సర్పవరంలోని టెకీ రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ లీకయ్యింది. గ్రామమంతా గ్యాస్ వ్యాపించింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రజలంతా వీధుల్లోకి పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.