Afghanistan Gangini : ఓల్డ్ ఈజ్ గోల్డ్.. కాలం మారినా కాదనలేకపోతున్నారు.. ఎన్నాళ్లైనా సంప్రదాయమే అద్బుతమంటున్నారు…

|

Jan 31, 2021 | 2:17 PM

అఫ్ఘానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో పండ్లు నిల్వ చేసుకోవడానికి ప్రత్యామ్నాయలు అచరిస్తున్నారు.

Afghanistan Gangini : ఓల్డ్ ఈజ్ గోల్డ్.. కాలం మారినా కాదనలేకపోతున్నారు.. ఎన్నాళ్లైనా సంప్రదాయమే అద్బుతమంటున్నారు...
Follow us on

అత్యాధునిక పద్దతులు అందుబాటులోకి వచ్చిన పురాతన వస్తువులే ఆ దేశం వాసులు అదరిస్తున్నారు.
పండ్లు, కూరగాయలు వంటివి తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవడానికి తప్పనిసరిగా ఫ్రిజ్‌ వాడుతుంటాం. అలాంటిది అఫ్ఘానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో పండ్లు నిల్వ చేసుకోవడానికి ప్రత్యామ్నాయలు అచరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులుగానీ, ఫ్రిజ్‌లపై గానీ ఏమాత్రం ఆధారపడటం లేదు. ద్రాక్ష వంటి పండ్లను ఆరునెలల పాటు చెక్కుచెదరకుండా నిల్వ చేసుకోవడానికి వారు పురాతనమైన సంప్రదాయ పద్ధతినే నేటికీ నమ్ముకుంటున్నారు. వాటినే వినియోగిస్తూ పండ్లను తాజాగా ఉంటుకుంటున్నారు.

ఎలాంటి పండ్లనైనా ఆరునెలల పాటు తాజాదనం చెక్కుచెదరకుండా నిల్వచేసే ఈ ప్రక్రియ పేరు ‘గాంగినా’. ఈ పద్ధతిలో తడి బంకమట్టితో బుట్టల్లాంటివి తయారు చేసి, వాటిలో తాజా పండ్లు ఉంచి, గాలి చొరబడే అవకాశం లేకుండా వాటిని మూసివేస్తారు.అవి పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో ఆరబెడతారు. ఎండిన బుట్టలను చీకటి గదుల్లో నిల్వ ఉంచుతారు. దీంతో ఆరు నెలలు అయిన పళ్లు, కూరగాయలు తాజాగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

ఇలా నిల్వ చేసిన వాటిని పండ్ల దిగుబడి లేని రుతువులో ఈ ‘గాంగినా‘ బుట్టలను తెరిచి, ఇందులోని పండ్లను వాడుకుంటారు. ‘గాంగినా’ బుట్టలను తయారు చేసేటప్పుడు వీటి అడుగు భాగాన్ని, పైమూతను రెండేసి పొరలుగా మట్టితో తయారు చేయడం వల్ల వీటిలో భద్రపరచిన పండ్లు చిరకాలం తాజాగా ఉంటాయంటున్నారు స్థానికులు. వీటిలో పండ్లను నిల్వ చేసేటప్పుడు, ముందుగా అతిగా ముగ్గిన వాటిని, కుళ్లిన వాటిని వేరు చేసేస్తామని, లేకుంటే మొత్తం పండ్లు పాడైపోతాయని అబ్దుల్‌ మానన్‌ అనే రైతు చెప్పారు.

Read Also.. పశ్చిమ బెంగాల్‌లో పదవ తరగతి విద్యార్థిని తీరును చూసి నివ్వెరపోతున్న అధికారులు.. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే..?