ప్రొఫెసర్ కాశింకి ఏడు రోజుల పోలీస్ కస్టడీ

| Edited By:

Jan 22, 2020 | 1:38 PM

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కాశింకి ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. కాగా.. బెయిల్ కోరుతూ ప్రొఫెసర్ కాశిం సిద్ధిపేట సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. నేడు ప్రొఫెసర్ కాశిం  బెయిల్ పిటీషన్‌పై భిన్న వాదనలు విన్న కోర్టు.. ఈ నెల 24వ తేదీకి ఆయన కేసు వాయిదా వేసింది. అంతేకాకుండా.. ఆయన ఏడు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉండాలన్ని కోర్టు పేర్కొంది.  కాగా.. గతంలో ఎల్బీనగర్‌లో […]

ప్రొఫెసర్ కాశింకి ఏడు రోజుల పోలీస్ కస్టడీ
Follow us on

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కాశింకి ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. కాగా.. బెయిల్ కోరుతూ ప్రొఫెసర్ కాశిం సిద్ధిపేట సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. నేడు ప్రొఫెసర్ కాశిం  బెయిల్ పిటీషన్‌పై భిన్న వాదనలు విన్న కోర్టు.. ఈ నెల 24వ తేదీకి ఆయన కేసు వాయిదా వేసింది. అంతేకాకుండా.. ఆయన ఏడు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉండాలన్ని కోర్టు పేర్కొంది.  కాగా.. గతంలో ఎల్బీనగర్‌లో నమోదైన కేసులో ఏ-8గా ప్రొఫెసర్ కాశిం పేరు ఉంది. 60 మందిపై సంఘవిద్రోహ శక్తుల కింద సంబంధిత చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రొఫెసర్ కాశింకు మావోయిస్టులతో ఉన్న సంబంధాల ఆధారాల నేపథ్యంలో వీటిని రేపు హైకోర్టులో పోలీసులు సమర్పించనున్నారు.