‘ అయోధ్య ‘ ముగిసింది.. ఇక ‘ శబరిమల ‘ కేసు తేలాలి

| Edited By: Srinu

Nov 11, 2019 | 5:19 PM

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17 న రిటైర్ కానున్నారు. ఈలోగా అతి ముఖ్యమైన నాలుగు కేసులపై ఆయన తీర్పునివ్వవలసి ఉంది. అయోధ్య కేసులో చరిత్రాత్మకమైన తీర్పును కోర్టు ఈ నెల 9 న వెలువరించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన నాలుగు కేసులు.. శబరిమల లో అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు.. మరొకటి , రాఫెల్ విమానాల డీల్ కు సంబంధించినది.. ఇంకొకటి , తమను ఉరి తీస్తారేమోన్న […]

 అయోధ్య  ముగిసింది.. ఇక  శబరిమల  కేసు తేలాలి
Follow us on

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17 న రిటైర్ కానున్నారు. ఈలోగా అతి ముఖ్యమైన నాలుగు కేసులపై ఆయన తీర్పునివ్వవలసి ఉంది. అయోధ్య కేసులో చరిత్రాత్మకమైన తీర్పును కోర్టు ఈ నెల 9 న వెలువరించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన నాలుగు కేసులు.. శబరిమల లో అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు.. మరొకటి , రాఫెల్ విమానాల డీల్ కు సంబంధించినది.. ఇంకొకటి , తమను ఉరి తీస్తారేమోన్న భయంతో మ్యాన్మార్ ను వదిలి వఛ్చిన సుమారు 40 వేల మంది రోహింగ్యాల పరిస్థితిపై నిర్ణయం..తో బాటు చీఫ్ జస్టిస్ పై కుట్రకు సంబంధించిన కేసును కూడా జస్టిస్ గొగోయ్ ఆధ్వర్యాన గల ధర్మాసనం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ చౌకీదార్ చోర్ హై ‘ అంటూ చేసిన ఆరోపణ తాలూకు కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదైన సంగతి విదితమే..( అయితే ఆ తరువాత రాహుల్.. తన వ్యాఖ్యకు బేషరతుగా క్షమాపణ చెప్పారు.) ఈ నెల 13… 15 తేదీల మధ్య జస్టిస్ గొగోయ్.. ఈ నాలుగు కేసులమీద తీర్పు
వెలువరించాల్సి ఉంది.

ముఖ్యంగా కేరళలోని శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించి అనుమతిని సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవి పెండింగులో ఉన్నాయి. 2018 సెప్టెంబరులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇఛ్చిన తీర్పు మీద ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగే 36 రాఫెల్ విమానాల కొనుగోలు సక్రమమైనదేనంటూ గత ఏడాది డిసెంబరు 14 న కోర్టు తీర్పునివ్వగా.. దాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ప్రతిపక్ష నేతలు రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై చీఫ్ జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎస్.కే. కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్ గత మే నెలలో ఉత్తర్వులను రిజర్వ్ చేశారు.
ఇంకా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేయడాన్ని కూడా సవాలు చేస్తూ కొందరు పిటిషన్లు వేశారు.

అటు- చీఫ్ జస్టిస్ పై కుట్రకు సంబంధించిన కేసును కూడా జస్టిస్ గొగోయ్ పరిష్కరించాల్సి ఉంది. (మాజీ న్యాయమూర్తి ఎ.కె పట్నాయక్ ఆధ్వర్యాన ఏర్పడిన సింగిల్ కమిటీ తన నివేదికను కోర్టుకు సమర్పించింది).
మరి..అతి సున్నితమైన అంశాలతో కూడిన ఈ కేసులపై ప్రధాన న్యాయమూర్తి ఎలా తీర్పునిస్తారో వేచిచూడాల్సి ఉంది.