ఏపీ వైపు చూస్తోన్న తెలంగాణ ఐపీఎస్‌లు

| Edited By:

Jun 07, 2019 | 4:04 PM

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పాలనను వేగవంతం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే తన సొంత టీమ్‌ను సిద్ధం చేసుకున్న ఆయన.. వారితో తనకు అనుగుణంగా పనిచేయించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తోన్న పలువురు ఐపీఎస్‌లు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారట. డిప్యుటేషన్‌పై వారు ఏపీకి వెళ్లాలని భావిస్తున్నారట. వీరందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసిన వారని తెలుస్తోంది. అంతేకాదు అప్పుడు వైఎస్ కుటుంబంతోనూ మంచి సాన్నిహిత్యం కలిగిన వీరు.. ఇప్పుడు […]

ఏపీ వైపు చూస్తోన్న తెలంగాణ ఐపీఎస్‌లు
Follow us on

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పాలనను వేగవంతం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే తన సొంత టీమ్‌ను సిద్ధం చేసుకున్న ఆయన.. వారితో తనకు అనుగుణంగా పనిచేయించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తోన్న పలువురు ఐపీఎస్‌లు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారట. డిప్యుటేషన్‌పై వారు ఏపీకి వెళ్లాలని భావిస్తున్నారట. వీరందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసిన వారని తెలుస్తోంది. అంతేకాదు అప్పుడు వైఎస్ కుటుంబంతోనూ మంచి సాన్నిహిత్యం కలిగిన వీరు.. ఇప్పుడు జగన్‌తో పనిచేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. కానీ వారికి ఇంకా స్థానచలనం లభించలేదు. పదోన్నతులు పొందినా.. వారు తమ హోదా కంటే తక్కువ పదవిలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఏపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఇటీవల నియమితులైన స్టీఫెన్ రవీంద్ర కూడా డిప్యుటేషన్‌పైనే వెళ్లి.. బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.