ప్రేమ పెళ్లి : నాలుగు కుటుంబాలు కుల బ‌హిష్క‌ర‌ణ‌

|

Sep 02, 2020 | 2:04 PM

కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం మల్కాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు దళిత కుటుంబాలను కుల పెద్దలు బహిష్కరించారు.

ప్రేమ పెళ్లి : నాలుగు కుటుంబాలు కుల బ‌హిష్క‌ర‌ణ‌
Follow us on

కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం మల్కాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు దళిత కుటుంబాలను కుల పెద్దలు బహిష్కరించారు. ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడినా రూ. 5వేల జరిమానా విధిస్తామ‌ని ప్ర‌క‌టించారు. గతంలో కూడా ఇవే కుటుంబాలను కుల పెద్ద‌లు బ‌హిష్క‌రించిన‌ట్టు స‌మాచారం. ప్రేమ పెళ్లి కుల బహిష్కరణ‌కు కార‌ణంగా తెలుస్తోంది. ఒక‌ కుటుంబంలోని వారు ప్రేమ పెళ్లి చేసుకోవ‌డంతో.. వారికి బంధువులైన నాలుగు కుటుంబాల‌ను కూడా బ‌హిష్క‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పోలీసులు క‌ల‌గ‌జేసుకోని ఇటువంటి ఘ‌ట‌న‌లు రిపీట్ అవ్వ‌కుండా చూడాలని ప‌లువురు కోరుతున్నారు.

 

Also Read :

మృతి చెందిన ప‌వ‌న్ ఫ్యాన్స్ కుటుంబాల‌కు బన్నీ ఆర్థిక సాయం

తెలంగాణ జైళ్ల శాఖ మ‌రో ఘ‌న‌త‌