
ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగీ ఆరోగ్యం మరింత విషమంగా మారింది. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో.. ఇంటి సమీపంలోని ఓ గార్డెన్లో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన కుంటుంబీకులు రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆదివారం నాడు ఆయన కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. శ్రీ నారాయణ ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. మెడికల్ బులిటెన్ ప్రకారం, శ్వాస తీసుకోవడంలో తలెత్తిన ఇబ్బందులతో ఆయన బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందడం లేదని పేర్కొన్నారు. దీంతో ఆయన కోమాలోకి జారుకున్నారని వైద్యులు ప్రకటించారు. మెడిసిన్స్కు ఆయన శరీరం సహకరిస్తుందో లేదన్నది తెలియాలంటే.. మరో 48 గంటలు కీలకమని తెలిపారు.