ఏపీ మాజీ స్పీకర్ ఆకస్మిక మృతి.. ఎన్టీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీచేసింది కూడా ఈయనే..

| Edited By:

Feb 17, 2020 | 12:43 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ ఆగరాల ఈశ్వర్ రెడ్డి ఆకస్మికంగా మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు గుండెపోటు రావడంతో.. వెంటనే ఆయన్ను తిరుపతి సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారు.1933 డిసెంబర్ 28న రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో జన్మించారు. 1957లో తూకివాక గ్రామం నుంచే ఈయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అదే ఏడాదిలో తూకివాక గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1962లో […]

ఏపీ మాజీ స్పీకర్ ఆకస్మిక మృతి.. ఎన్టీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీచేసింది కూడా ఈయనే..
Follow us on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ ఆగరాల ఈశ్వర్ రెడ్డి ఆకస్మికంగా మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు గుండెపోటు రావడంతో.. వెంటనే ఆయన్ను తిరుపతి సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారు.1933 డిసెంబర్ 28న రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో జన్మించారు. 1957లో తూకివాక గ్రామం నుంచే ఈయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అదే ఏడాదిలో తూకివాక గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1962లో తిరుపతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు.రు. రెండోసారి తిరిగి ఇదే స్థానం నుంచి మళ్లీ పోటి చేసి.. భారీ మెజార్టీతో విజయం సాధించారు. 1981-82లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు స్పీకర్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈశ్వర్‌రెడ్డి మృతి పట్ల.. తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.