Bird Sickness: పక్షుల అనారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ పర్యావరణ శాఖ అధికారులు .. లేదంటే తీవ్ర పరిణామాలు..

|

Jan 07, 2021 | 6:01 PM

Bird Sickness: బర్డ్ ప్లూ‌ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని జూ పార్కు సిబ్బందికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది.

Bird Sickness: పక్షుల అనారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ పర్యావరణ శాఖ అధికారులు .. లేదంటే తీవ్ర పరిణామాలు..
Follow us on

Bird Sickness: బర్డ్ ప్లూ‌ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని జూ పార్కు సిబ్బందికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. జూ పార్కులు, ఇతర ప్రదేశాల్లో పక్షులు అనారోగ్యంతో చనిపోతే తగిన కారణాలను విశ్లేషించాలని ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం చేసిన తర్వాత నిర్దారణకు రావాలని తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారులకు, జూ పార్కు క్యూరేటర్లకు రాష్ట్ర పీసీసీఎఫ్ ఆర్. శోభ ఆదేశాలు జారీ చేసింది.

ఏవియన్ ప్లూ వైరస్ వ్యాప్తితో నాలుగైదు రాష్ట్రాల్లో వివిధ రకాల పక్షులు చనిపోతున్నాయి. ముఖ్యంగా వలస పక్షుల విషయంలో అప్రమత్తత అవసరమన్నారు. కేంద్ర వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ రాసిన లేఖను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పీసీసీఎఫ్ పలు విషయాలను తెలిపింది. అనారోగ్యంతో చనిపోయిన పక్షుల నుంచి సాంపిళ్లను తీసి పరీక్ష నిమిత్తం భోపాల్‌లోని యానిమల్ డిసీజెస్‌ ల్యాబ్‌కు పంపించాలని సూచించింది. పెంపుడు జంతులవుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిథిలో కొత్తగా 57 థీమ్ పార్కులు.. ప్రణాళికలు సిద్ధం చేసిన జీహెచఎంసీ..

నూతన సంవత్సర వేడుకల్లో వేలాది పక్షుల బలి . రోమ్ లో ఫైర్ వర్క్స్ ‘హంగామా; ప్రజల ఉత్సాహం , మూగజీవాల మృతి