Bird Flu Alert: బర్డ్‌ ఫ్లూ సోకకుండా ఉండాలంటే ఇలా చేయండి… కీలక సూచనలు చేసిన ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ..

|

Jan 22, 2021 | 12:30 PM

Food Regulator Asks Consumers To Eat: కరోనా మహమ్మారి పూర్తిగా కనుమరుగుకాక ముందే బర్డ్‌ ఫ్లూ కలకలం మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాలో ఈ వైరస్‌ కారణంగా వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇదిలా ఉంటే..

Bird Flu Alert: బర్డ్‌ ఫ్లూ సోకకుండా ఉండాలంటే ఇలా చేయండి... కీలక సూచనలు చేసిన ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ..
Follow us on

Food Regulator Asks Consumers To Eat: కరోనా మహమ్మారి పూర్తిగా కనుమరుగుకాక ముందే బర్డ్‌ ఫ్లూ కలకలం మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాలో ఈ వైరస్‌ కారణంగా వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ బర్డ్‌ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు సోకినట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ సోకే అవకాశాలు లేవని కచ్చితంగా చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బర్డ్‌ ఫ్లూ సోకకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుదల చేసింది. పౌల్ట్రీ మాంసాన్ని, గుడ్ల‌ను ఎలా తీసుకోవాల‌న్న దానిపై పలు సూచనలు చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపిన సూచనల ప్రకారం.. స‌గం ఉడికిన గుడ్లు తిన‌కూడదు. అలాగే సరిగా ఉడకని చికెన్‌ తినొద్దని సూచింది. ఫ్లూ సోకిన ప్ర‌దేశాల్లో ప‌క్షుల‌ను, అదే విధంగా చ‌నిపోయిన ప‌క్షుల‌ను గ్లౌజ్‌లు లేకుండా ఉత్త చేతుల‌తో తాకకూడదు. పచ్చి మాంసాన్ని బహరింగంగా పెట్టకూడదని, అలాంటి మాంసాన్ని నేరుగా తినొద్దని సూచింది. ఇక చివరికి ప‌చ్చి మాంసం ప‌ట్టుకునే స‌మ‌యంలోనూ మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. తరుచూ చేతులు కడుక్కోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Also Read: India Corona Cases: దేశంలో మరో 14,545 మందికి కరోనా.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా