ఓ జానపద పాటకు కురిసిన నోట్ల వర్షం..అమెరికన్ డాలర్లు కూడా…

|

Feb 04, 2020 | 8:21 AM

పాప్ సింగర్స్‌కి ఫాలోయింగ్ ఉండటం కామన్. ఇక జానపద గాయకులకు, వాగ్గేయకారులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటారు. కానీ జానపద గాయని గీతా రబారీకి పాడిన ఓ పాటకు ఇండియన్ కరెన్సీతో పాటు డాలర్ల వర్షం కురిసింది.  చిస్లీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వన్​జనా గ్రామంలో మెలడీ మాత ఆలయంలో ఉంది. ఆలయ ధర్మకర్తలు ఇటీవల అక్కడ గీతా రబారీ పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గీత పాట అందుకోగానే నోట్ల […]

ఓ జానపద పాటకు కురిసిన నోట్ల వర్షం..అమెరికన్ డాలర్లు కూడా...
Follow us on

పాప్ సింగర్స్‌కి ఫాలోయింగ్ ఉండటం కామన్. ఇక జానపద గాయకులకు, వాగ్గేయకారులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటారు. కానీ జానపద గాయని గీతా రబారీకి పాడిన ఓ పాటకు ఇండియన్ కరెన్సీతో పాటు డాలర్ల వర్షం కురిసింది.  చిస్లీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వన్​జనా గ్రామంలో మెలడీ మాత ఆలయంలో ఉంది. ఆలయ ధర్మకర్తలు ఇటీవల అక్కడ గీతా రబారీ పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గీత పాట అందుకోగానే నోట్ల వర్షం ప్రారంభమైంది. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు..10 రూపాయల దగ్గర్నుంచి 2000 నోట్లకు వరకు విరజిమ్మారు. అంతేనా అమెరికా కరెన్సీ కూడా వాటికి జమైంది.

ఈ డబ్బంతా కలిపితే సుమారు 10 లక్షలు వరకు ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తోన్నారు. వచ్చిన డబ్బంతా…మెలడీ మాత ఆలయ అభివృద్దికే సమర్పిస్తానని ఆమె తెలిపారు. కాగా ఈ జానపద గాయని ఇటీవలే ప్రధాని మోదీని కలిశారు. ఆయన పిలుపు మేరకు స్వచ్చ భారత్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.