తాబేలు గూడును నాశనం చేస్తావా? మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు

|

Jun 17, 2019 | 1:18 PM

అంతరించిపోయే జంతు, పక్షి, సరిసృపాల జాతులను రక్షించుకోడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వాటి జాతి ఉన్నతికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే అంతరించిపోతున్న జాతుల్లో తాబోలు కూడా ఒకటి. అన్నీ కాదు కానీ వీటిలో కొన్ని జాతులు అంతరించేపోయే దశలో ఉన్నాయి. మన దేశంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కాపాడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలానే అమెరికాలో కూడా తాబేళ్లను సంరక్షించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు అంతగా […]

తాబేలు గూడును నాశనం చేస్తావా? మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
Follow us on

అంతరించిపోయే జంతు, పక్షి, సరిసృపాల జాతులను రక్షించుకోడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వాటి జాతి ఉన్నతికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే అంతరించిపోతున్న జాతుల్లో తాబోలు కూడా ఒకటి. అన్నీ కాదు కానీ వీటిలో కొన్ని జాతులు అంతరించేపోయే దశలో ఉన్నాయి. మన దేశంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కాపాడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలానే అమెరికాలో కూడా తాబేళ్లను సంరక్షించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వాలు అంతగా వాటి ఉనికి కోసం ప్రయత్నిస్తుంటే..కొంతమంది మాత్రం వాటిని చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. తమ చిన్న చిన్న ఆనందాల కోసం..వాటిని లెక్కచేయకుండా..తమకిష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అలా చేసే అమెరికాలోని ప్లోరిడాలో ఒక మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

41 ఏళ్ల యాకన్ లూ అనే మహిళ… మియామీ బీచ్‌లో తాబేలు నిర్మించుకున్న గూటిని సర్వ నాశనం చేసింది. సాధారణంగా తాబేళ్లు గూళ్లు కట్టుకోవు. గుడ్లు పెట్టే ముందే అవి గొయ్యి తవ్వుకుంటాయి. ఆ మహిళ… మరే ప్లేసూ దొరకనట్లు… వెళ్లి వెళ్లి ఆ గొయ్యిపైనే బీచ్ అందాలను చూస్తూ చిందులు వేసింది. దీంతో ఆ గొయ్యి పూడుకుపోయింది. ఇదంతా చూసిన ఓ జంతు ప్రేమికుడు విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ దృశ్యాన్ని ఫొటో తీసి, సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు… ఇక అటువైపు పర్యాటకులు ఎవరూ రాకుండా… ఎల్లో టేప్స్ పెట్టారు. అక్కడ “డు నాట్ డిస్టర్బ్ సీ టర్టిల్ నెస్ట్” (తాబేళ్ల గూళ్లను పాడుచెయ్యవద్దు) అని రాశారు.

చైనాకు చెందిన యాకన్ లూపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి తాబేళ్లకు హాని కలిగించడం, రెండు తాబేళ్ల గుడ్లు నాశనం చెయ్యడం. మిచిగాన్‌లోని తన అడ్రెస్‌ని వాళ్లకు ఇచ్చిన ఆమె… త్వరలోనే కోర్టు నోటీసులు అందుకోబోతోంది. 1973 నాటి ఫ్లోరిడా అరుదైన అంతరించిపోయే జీవుల చట్టం ప్రకారం తాబేళ్లను ముట్టుకోవడం, హాని చెయ్యడం, గుడ్లను టచ్ చెయ్యడం, నాశనం చెయ్యడం వంటివి నేరం కింద లెక్క. మియామీ బీచ్‌లో లాగ్గర్ హెడ్, గ్రీన్, లెదర్ బ్యాక్ జాతి తాబేళ్లు జీవిస్తున్నాయి. అవి ఏప్రిల్ నుంచీ నవంబర్ వరకూ గూళ్లు కట్టుకుంటాయి