నీట మునిగిన గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీ… సుమారు రూ 1.30 కోట్ల నష్టం..

| Edited By: Pardhasaradhi Peri

Oct 16, 2020 | 11:11 AM

హైదరాబాద్‌ మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ‘గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీ’లోకి వరద నీరు వచ్చి చేరింది.

నీట మునిగిన గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీ... సుమారు రూ 1.30 కోట్ల నష్టం..
Follow us on

హైదరాబాద్‌ మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ‘గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీ’లోకి వరద నీరు వచ్చి చేరింది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న ఒలింపిక్‌ మెడలిస్ట్, షూటర్‌ గగన్‌ నారంగ్‌ గన అకాడమీ షూటింగ్‌ రేంజ్‌లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో దాదాపు రూ. 1.3 కోట్లు విలువైన షూటింగ్‌ సామగ్రి పాడైనట్లు నారంగ్‌ అవేదన వ్యక్తం చేశాడు. 24 గంటల్లో అంతా నాశనమైంది. భారీ వరద మా షూటింగ్‌ రేంజ్‌ను ముంచెత్తింది. కొత్తగా తెచ్చిన 80 రైఫిల్స్, పిస్టల్స్‌తో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా నీట మునిగాయి. జీఎఫ్‌జీ సిబ్బంది 9 ఏళ్ల కష్టం వరద నీటిలో కొట్టుకుపోయిందంటూ బాధతో నారంగ్‌ పోస్ట్‌ చేశాడు. ఇప్పటికే కరోనా వల్ల ఏర్పడిన నష్టం చాలదన్నట్లు… తాజా వరదలు జీఎఫ్‌జీని ఆర్థికంగా దెబ్బ తీశాయని నారంగ్‌ పేర్కొన్నారు. జీఎఫ్‌జీని ప్రపంచస్థాయి షూటింగ్‌ అకాడమీగా మార్చేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడ్డామని, ఇకపై అకాడమీని మునపటిలా మార్చడానికి వీలవుతుందో లేదో చెప్పడం కష్టమని ఆందోళన వ్యక్తం చేశాడు.