గంటన్నరలోనే నిత్యావసరాల డెలివరీ..!

| Edited By:

Jul 29, 2020 | 9:51 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆర్డర్ చేసిన గంటన్నరలోనే... నిత్యావసరాలను ఇంటికి డెలివరీ చేసేలా... క్విక్ సేవలను ప్రారంభించింది ‘ఈ కామర్స్’ దిగ్గజం ‘ ఫ్లిప్‌కార్ట్’.

గంటన్నరలోనే నిత్యావసరాల డెలివరీ..!
Follow us on

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆర్డర్ చేసిన గంటన్నరలోనే… నిత్యావసరాలను ఇంటికి డెలివరీ చేసేలా… క్విక్ సేవలను ప్రారంభించింది ‘ఈ కామర్స్’ దిగ్గజం ‘ ఫ్లిప్‌కార్ట్’. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన నిత్యావసర వస్తువులను అమెజాన్ ఇండియా, జియో మార్ట్ డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. వీటికి పోటీనిచ్చే మాదిరిగా క్విక్ పేరుతో ముందుకు వచ్చింది ఫ్లిప్‌కార్ట్ . బెంగళూరులో ఈ సేవలు ప్రారంభమయ్యాయి కూడా.

కనీస డెలివరీ ఛార్జీని రూ. 29 గా నిర్ణయించారు. అర్ధరాత్రి దాకా సేవలను విస్తరించారు. మటన్, చికెన్ సహా మరో రెండు వేల రకాల ఉత్పత్తులను క్విక్ సేవల కింద సరఫరా అవుతాయి. బెంగళూరులో కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలను తాజాగా ప్రారంభించారు. వైట్‌ఫీల్డ్, పనతూరు, హెచ్ఎస్ఆర్ లే ఔట్, బీటీఎం లే ఔట్, బానాశంకరి, కేఆర్ పురమ్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆరు ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.

Read More:

కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన

కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!