హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పొగతో ఉక్కిరిబిక్కిరైన జనం

| Edited By:

Oct 28, 2019 | 6:34 AM

దీపావళి పండుగ రోజు మహానగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని ఓ టైర్ రిట్రేడింగ్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న టైర్లకు ఆ నిప్పంటుకుని తగలబడ్డాయి. విషయం తెలుసుకున్న గోదాం యజమానులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు.. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది. దీంతో స్థానికులు […]

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పొగతో ఉక్కిరిబిక్కిరైన జనం
Follow us on

దీపావళి పండుగ రోజు మహానగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని ఓ టైర్ రిట్రేడింగ్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న టైర్లకు ఆ నిప్పంటుకుని తగలబడ్డాయి. విషయం తెలుసుకున్న గోదాం యజమానులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు.. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది. దీంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. టైర్ల నుంచి పొగలు వెలువడుతుండటంతో.. స్థానికులు శ్వాస తీసుకోడానికి తీవ్ర ఇబ్బుందులు పడ్డారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై గోదాం నిర్వాహకులను, స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. దీపావళి కావడంతో బాణాసంచా ఎగిరిపడటంతో ఈ ప్రమాదం జరిగిందా.. లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా..? లేదా మరేదైనా కారణమై ఉండొచ్చా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.