ప్రకృతి సోయగాల సిగలో భారీగా అగ్నికీలలు

|

Oct 24, 2020 | 8:03 AM

శీతల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో నిన్న రాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెకాంగ్ పియోకు చెందిన 17 వ బెటాలియన్ ఐటిబిపి దళాలు శక్తివంచనలేకుండా కృషి చేయడంతో ప్రాణనష్టం జరుగలేదు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన రక్షణ దళాలు పెద్ద ఎత్తున గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్రకృతి సోయగాలకు నెలవైన కిన్నౌర్ ప్రాంతంలోని పూర్బాని గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో13 ఇళ్ళు కాలిబూడిదయ్యాయి. హిమాచల్ […]

ప్రకృతి సోయగాల సిగలో భారీగా అగ్నికీలలు
Follow us on

శీతల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో నిన్న రాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెకాంగ్ పియోకు చెందిన 17 వ బెటాలియన్ ఐటిబిపి దళాలు శక్తివంచనలేకుండా కృషి చేయడంతో ప్రాణనష్టం జరుగలేదు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన రక్షణ దళాలు పెద్ద ఎత్తున గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్రకృతి సోయగాలకు నెలవైన కిన్నౌర్ ప్రాంతంలోని పూర్బాని గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో13 ఇళ్ళు కాలిబూడిదయ్యాయి. హిమాచల్ ప్రభుత్వం బాధితులకు నిత్యావసరాలు అందిస్తూ బాసటగా నిలుస్తోంది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.