అసభ్యంగా ప్రవర్తించిన తబ్లిగీలపై ఎఫ్‌ఐఆర్‌..!

| Edited By:

Apr 07, 2020 | 2:54 PM

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్‌ కార్యక్రమం అనంతరం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత అధికమౌతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అసభ్యంగా ప్రవర్తించిన తబ్లిగీలపై ఎఫ్‌ఐఆర్‌..!
Follow us on

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్‌ కార్యక్రమం అనంతరం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత అధికమౌతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఇప్పటికే గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో క్వారంటైన్‌ కేంద్రాల్లో వీరు ప్రవర్తిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. వైద్య సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం, క్వారంటైన్‌ కేంద్రాల్లో అపరిశుభ్రంగా ఉంటూ వైద్య సిబ్బందికి ఇబ్బందులు కలిగిస్తున్న సంఘటనలు పలుచోట్ల వెలుగులోకి వచ్చాయి.

కాగా.. తాజాగా దిల్లీలోని ఓ క్వారంటైన్‌ కేంద్రంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు తబ్లిగీ సభ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు పోలీసులు. నిజాముద్దీన్‌ కార్యక్రమానికి హాజరైన కొందరు తబ్లిగీలను నరేలా క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఫహద్‌(25), జహీర్‌(18)లు గతకొన్నిరోజులుగా వారు ఉంటున్న కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణం కలిపిస్తున్నారు. తాజాగా 2వ అంతస్తులో వీరు ఉంటున్న గదిముందే ఈ యువకులు బహిరంగ మలమూత్ర విసర్జన చేశారు. ఇది గుర్తించిన ఆసుపత్రి పారిశుద్ద్య సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు.

అయితే.. వీరి విపరీత పోకడలతో విసుగొచ్చిన అధికారులు తొలుత హెచ్చరించి వదిలేసినా, ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యువకులపై విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటువ్యాధుల చట్టం-1897 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే దిల్లీలో 523మంది కరోనా బారిన పడగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ సోకి 114 మరణించగా 4421 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కొందరు థాయ్, ఇండోనేషియా, మలేసియా జాతీయులు పాస్‌పోర్ట్ రెగ్యులేషన్ యాక్ట్ ను అధిగమించారు. ఈరోడ్, సేలం, చెన్నై పోలీసులు 18 మంది ఇండోనేషియా, 6 మంది థాయ్, 10 మలేసియా జాతీయులపై కేసులు నమోదు చేశారు. 34 మంది ఇండోనేషియా, థాయ్, మలేసియా జాతీయులు డిల్లీ తబ్లీఘీ జమాత్ కు వెళ్లివచ్చిన వారిలో ఉన్నారు. వీరంతా సేలం, ఈరోడ్, చెన్నైలలో మత ప్రచారంలో నిమగ్నమయ్యారు. విదేశీయులపై జాతీయ విపత్తు 2005 యాక్ట్ కింద 13, 14, సిసిబి యాక్ట్ 188, 269, 270, 271 ఐపిసీ, మరియు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 17 మందికి కరోనా పాజిటవ్ అని తేలింది.