అక్కడ.. తండ్రులకు కూడా.. 6 నెలలు పేరెంటల్ లీవ్‌..!

| Edited By:

Feb 07, 2020 | 6:03 AM

క్షిణిస్తున్న తల్లిదండ్రుల సంబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కుటుంబ ప్రయోజనాల సంస్కరణ దిశగా ఫిన్లాండ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తల్లులకు మాత్రమే ఇచ్చే పేరెంటల్ లీవ్‌ను ఇకపై తండ్రులకు కూడా ఇవ్వాలని ఫిన్లాండ్ మహిళల సారథ్యంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. తండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిన్లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి 164 రోజుల సెలవు అయితే ఆమెకు సమానంగా తండ్రికి కూడా 164 రోజులు […]

అక్కడ.. తండ్రులకు కూడా.. 6 నెలలు పేరెంటల్ లీవ్‌..!
Follow us on

క్షిణిస్తున్న తల్లిదండ్రుల సంబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కుటుంబ ప్రయోజనాల సంస్కరణ దిశగా ఫిన్లాండ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తల్లులకు మాత్రమే ఇచ్చే పేరెంటల్ లీవ్‌ను ఇకపై తండ్రులకు కూడా ఇవ్వాలని ఫిన్లాండ్ మహిళల సారథ్యంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. తండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిన్లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి 164 రోజుల సెలవు అయితే ఆమెకు సమానంగా తండ్రికి కూడా 164 రోజులు సెలవు ఇవ్వనున్నారు. దీంతోపాటు ఇద్దరికి చెల్లింపు భత్యం కూడా పెరుగుతుంది.

ఆరోగ్యం, సామాజిక వ్యవహారాల మంత్రి ఐనో-కైసా పెకోనెన్ మాట్లాడుతూ.. ‘ దీని లక్ష్యం లింగ సమానత్వాన్ని మెరుగుపరచడం, క్షీణిస్తున్న జనన రేటును పెంచడం అని తెలిపారు. పొరుగున ఉన్న స్వీడన్ లో తల్లిదండ్రుల సెలవు క్రమంలో చాలా ఉదారమైన వ్యవస్థ కలిగి ఉంది. బిడ్డ పుట్టిన తర్వాత స్వీడన్‌లో తల్లిదండ్రులు ఇద్దరికీ 240 రోజులు సెలవు ఇస్తారు. ప్రస్తుతం ఫిన్లాండ్‌లో ఉన్న సిస్టమ్ ప్రకారం 4.2నెలలు మెటర్నటీ సెలవు ఇస్తారు. బిడ్డకు రెండేళ్లు వచ్చే సమయంలోపు తండ్రికి 2.2నెలలు సెలవులు ఇస్తారు. ఆ పైన, మరో ఆరు నెలల సెలవులను తల్లిదండ్రులు పంచుకోవచ్చు’ అని తెలిపారు.