గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌కి రూ.50 వేల కోట్లు: కేంద్రమంత్రి

|

Jun 19, 2020 | 12:31 PM

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌గా ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ స్కీం ద్వారా ఉపాధి అందించేందుకుగానూ రూ.50వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌కి రూ.50 వేల కోట్లు: కేంద్రమంత్రి
Follow us on

దేశంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 25 పథకాలను ఒకచోట చేర్చి గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌గా ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ స్కీం ద్వారా ఉపాధి అందించేందుకుగానూ రూ.50వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. వీటితో దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని వలస కూలీలకు కనీసం 125 రోజులు పని కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తద్వారా స్వగ్రామాలకు చేరిన వలస కూలీలకు చేతినిండా పనితో పాటు ఆర్థిక వృద్ది చెందుతారన్నారు.
దేశ వ్యాప్తంగా 25 రకాల పనులకు ఈ స్కీంను వర్తింపజేస్తున్నామన్న మంత్రి.. కూలీలందరికీ పనితో పాటు సంపద పెరిగి, గ్రామీణాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందన్నారు. బీహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మ ధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్తాన్‌లోని 116 జిల్లాల్లోని వలసకూలీలకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్న మంత్రి.. వారి వారి స్కిల్ వెలికితీసి అయా రంగాల వారిగా పని కల్పిస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఆమె పేర్కొన్నారు.