ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సినీ నిర్మాత

|

Oct 13, 2020 | 3:20 PM

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ సినీ నిర్మాత అమరావతి హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన తనకు నష్టపరిహారం చెల్లించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రసిద్ద సినీ నిర్మాత...

ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సినీ నిర్మాత
Follow us on

Film producer approached court opposing Government decision: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన తనకు నష్టపరిహారం చెల్లించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రసిద్ద సినీ నిర్మాత అశ్వనీదత్ అమరావతి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అశ్వనీదత్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. అశ్వనీదత్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఫైనల్ కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్ శాఖలతోపాటు సీఆర్డీఏకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించాలని తలపెట్టింది. సమీప ప్రాంతాల్లోని భూములను సేకరించింది. ఇందులో భాగంగా అశ్వనీదత్‌కు చెందిన భూములను కూడా అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఇందుకు బదులుగా అమరావతి ఏరియాలో అశ్వనీదత్‌కు ఫ్లాట్‌ను కేటాయించింది.

 

 

అయితే, ఇప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు నుంచి వైదొలగడంతో తనకు నష్టం వాటిల్లిందంటున్న అశ్వనీదత్.. తనకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన లీజు మొత్తం కూడా రావడం లేదని అశ్వనీదత్ దంపతులు కోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలతోపాటు సీఆర్డీఏకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

Also read: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు