
‘బాహుబలి’ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమా సెన్సార్ కాపీ చూసిన ఉమేర్ సంధూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘సాహోలో ప్రభాస్ ఎంట్రీనే ఓ అద్భుతం. సినిమా ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీన్స్ , ఛేజింగ్ సీన్స్ అబ్బురపరుస్తాయని’ అయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశాడని.. ఆ రోల్లో ప్రభాస్ తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ‘సాహో’ హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు. బాక్స్ ఆఫీస్ బ్లాక్‌బస్టర్ ‘సాహో’ ఎన్నో రికార్డులను చెరిపేస్తుందని ఆయన పేర్కొన్నారు.