నడిరోడ్డుపై అన్నదాత ఆగ్రహం… రివర్స్ కేసు పెట్టిన ఖాకీలు

|

Apr 15, 2020 | 5:18 PM

దేశానికి అన్నం పెట్టే కర్షకుని కడుపు మండితే ఎలా వుంటుందో మరోసారి నిరూపణ అయ్యింది. ఆరుగాలం కష్టపడి పండించే పంటను అమ్ముకోనీయక పోతే, దాని ఫలితం గుర్తొచ్చి ఆ రైతుపడే ఆవేదన ఎలా వుంటుందో పోలీసులకు తెలిసొచ్చేలా చేశాడా రైతు.

నడిరోడ్డుపై అన్నదాత ఆగ్రహం... రివర్స్ కేసు పెట్టిన ఖాకీలు
Follow us on

దేశానికి అన్నం పెట్టే కర్షకుని కడుపు మండితే ఎలా వుంటుందో మరోసారి నిరూపణ అయ్యింది. ఆరుగాలం కష్టపడి పండించే పంటను అమ్ముకోనీయక పోతే, దాని ఫలితం గుర్తొచ్చి ఆ రైతుపడే ఆవేదన ఎలా వుంటుందో పోలీసులకు తెలిసొచ్చేలా చేశాడా రైతు. ఏపీ, తమిళనాడు బోర్డర్‌లో జరిగిన ఈ ఉదంతం రైతు ఆవేదనను ఆవిష్కరిస్తే.. మనసులు కరుగని ఖాకీలు ఉల్టా ఆ రైతుపైనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్‌కు లాక్కు వెళ్ళిన దారుణ ఉదంతమిది.

ఏపీ-తమిళనాడు బోర్డర్ గ్రామం తిరువళ్ళూరులో ఓ రైతు పోలీసులపై ఆగ్రహాన్ని వెళ్ళగక్కాడు. పండించిన పంట (కూరగాయలు) రవాణా సౌకర్యం లేక సొంత బైక్ తీసుకెళ్ళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు సుమారు రెండు గంటలపాటు రైతు తన పరిస్థితి చెప్పుకుని పోలీసులను బతిమాలాడు. పోలీసులు ఎంతకూ వినలేదు. వెళ్ళేందుకు వీలు లేదని ఖరాఖండీగా చెప్పారు. తన ఆవేదన పోలీసులు అర్థం కాకపోవడంతో కర్షకుని కడుపు మండింది. బతిమాలి, బతిమాలి విసుగు చెందిన రైతు.. తన ఆగ్రహాన్ని నడి రోడ్డుపైనే వెళ్ళగక్కాడు.

పోలీస్ జీపు ముందు తాను విక్రయించుకునేందుకు తీసుకుపోతున్న కూరగాయలను పారబోశాడు. కూరగాయలను ఆవేశంతో అతను నడి రోడ్డుమీద పారబోస్తుంటే కూడా పోలీసులు చోద్యం చూశారే గానీ అతన్ని వారించలేదు. కూరగాయలను పారబోసిన రైతు.. ఇంకెన్నాళ్ళో తాను పస్తులుండలేనంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఇదేమీ పట్టని పోలీసులు మాత్రం సదరు రైతు మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు.