ఫొని పడగ… ఒడిశాలో 11 జిల్లాలకు ఈసీ కోడ్ ఎత్తివేత

|

May 01, 2019 | 5:32 PM

ఫొని తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒడిశాలోని 11 జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా ఎన్నికల కమీషన్ కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఒడిశా తీరప్రాంతంలో ఈ తుఫాన్ వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన దృష్ట్యా ఒడిశాలోని పాఠశాలలు, కళాశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో పాటు మే 19వ […]

ఫొని పడగ... ఒడిశాలో 11 జిల్లాలకు ఈసీ కోడ్ ఎత్తివేత
Follow us on

ఫొని తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒడిశాలోని 11 జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా ఎన్నికల కమీషన్ కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఒడిశా తీరప్రాంతంలో ఈ తుఫాన్ వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన దృష్ట్యా ఒడిశాలోని పాఠశాలలు, కళాశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటించారు.

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో పాటు మే 19వ తేదీన జరగనున్న పాటకుర అసెంబ్లీ ఎన్నికను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసీను కోరారు. దీంతో ఒడిశాలోని 11 జిల్లాల్లో కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.