ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

|

Oct 26, 2020 | 5:00 PM

ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్ కతౌలీ తెహ్సిల్ జిల్లా ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్తకు నెలవారీ భరణం ఇవ్వాల్సిందిగా ఓ గవర్నమెంట్ ఉద్యోగినిని ఆదేశించింది.

ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు
Follow us on

ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్ కతౌలీ తెహ్సిల్ జిల్లా ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్తకు నెలవారీ భరణం ఇవ్వాల్సిందిగా ఓ గవర్నమెంట్ ఉద్యోగినిని ఆదేశించింది. ఈ కేసుపై తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా విచారణ జరిపిన ఫ్యామిలీ  కోర్టు..తాజాగా తీర్పు వెలువరించింది. అయితే నెలకు వెయ్యి రూపాయల భరణం మాత్రమే చెల్లించాలని కోర్టు పేర్కొంది.

వివరాల్లోకి వెళ్తే..కిషోరీలాల్​ సోహుంకర్, మున్నాదేవీలకు 30ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అవి తీవ్ర రూపం దాల్చడంతో  10ఏళ్ల నుంచి వీరు విడివిడిగా ఉంటున్నారు. మున్నాదేవీ కాన్పూర్​లోని ఇండియన్ ఆర్మీలో ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగినిగా పనిచేసి, రిటైర్ అయ్యారు. ఆమెకు ప్రస్తుతం నెలకు 12వేల పెన్షన్ వస్తోంది. కిషోరీలాల్ కతౌలీలో ఓ టీషాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణంగా తన భార్యకు వచ్చే పెన్షన్‌లో కొంత ఇవ్వాలంటూ 9 ఏళ్ల క్రితం ముజఫర్​నగర్​లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ విచారించిన ధర్మాసనం..తాజాగా తీర్పును వెలువరించింది.

కేసు ఇంకా పరిష్కారం కాలేదని కిషోరీలాల్​ అడ్వకేట్​ బలేష్​ కుమార్​ తయాల్ వివరించారు. ఇద్దరు కలిసుండాలని కోర్టు గతంలో ఆదేశించినా..  మున్నీదేవి అందుకు  ఒప్పుకోలేదని తెలిపారు. దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని వెల్లడించారు. కాగా కోర్టు తీర్పుతో తృప్తి కలగలేదని కిషోరీలాల్ అన్నారు. దాదాపు 9ఏళ్ల తరువాత కోర్టు తీర్పును వెలువరించిందని.. తాను అప్పు చేసి ఈకేసు కోసం పోరాడినట్లు చెప్పారు. 20ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోందని… ప్రస్తుతం తన భార్య పింఛను రూ.12వేల కంటే ఎక్కువే వస్తోందని చెప్పారు.

Also Read :  అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్​బుక్ కీలక నిర్ణయం !