‘సీక్రేట్ క్రష్’ పేరుతో… ఫేస్‌బుక్‌లో డేటింగ్ ఫీచర్!

| Edited By:

May 03, 2019 | 7:05 PM

టిండర్‌ విజయంతో ఫేస్‌బుక్ కొత్త ప్రయోగాలకు సిద్ధమైంది. తన ప్లాట్‌ఫామ్‌పై సీక్రేట్ డేటింగ్ సర్వీసులు ప్రారంభించింది. సీక్రేట్ క్రష్ పేరుతో ఈ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫేస్‌బుక్ తన వార్షిక డెవలపర్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 20 కోట్ల మంది సింగిల్స్ ఉన్నారని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. టిండర్‌లో డేటింగ్ సర్వీసులు […]

సీక్రేట్ క్రష్ పేరుతో... ఫేస్‌బుక్‌లో డేటింగ్ ఫీచర్!
Follow us on

టిండర్‌ విజయంతో ఫేస్‌బుక్ కొత్త ప్రయోగాలకు సిద్ధమైంది. తన ప్లాట్‌ఫామ్‌పై సీక్రేట్ డేటింగ్ సర్వీసులు ప్రారంభించింది. సీక్రేట్ క్రష్ పేరుతో ఈ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఫేస్‌బుక్ తన వార్షిక డెవలపర్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 20 కోట్ల మంది సింగిల్స్ ఉన్నారని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. టిండర్‌లో డేటింగ్ సర్వీసులు పొందాలంటే 30 డాలర్లు (దాదాపు రూ.2,000) చెల్లించాలి. ఇదే ఫీచర్ ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి వస్తే చాలా మంది ఈ సేవలను ఉపయోగించే అవకాశముంది. అయితే కొత్త ఫీచర్ విజయవంతమౌతుందా? లేకపోతే విమర్శలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.

ఫేస్‌బుక్ డేటింగ్ సేవలు మే 1 నుంచి సింగపూర్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీసుల్లో యూజర్లు వారి కమ్యూనిటీలు, గ్రూప్స్, ఫ్రెండ్స్‌లో భాగస్వామిని  వెతుక్కోవచ్చు. మీ అభిప్రాయాలకు మ్యాచ్ అయ్యేవారితో చాట్ చేయవచ్చు… కలవొచ్చు… త్వరలోనే ఈ సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి రావొచ్చు.