ఓవైసీ వాయిస్… పేస్‌బుక్ పక్షపాతంతో వ్యవహరిస్తోంది… వారిపై చర్యలు చేపట్టేందుకు భయపడుతోంది…

| Edited By:

Dec 16, 2020 | 12:51 PM

ఫేస్‌బుక్‌పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి మండిపడ్డారు. ఫేస్‌బుక్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీని సంతృప్తి పరిచేందుకు భజరంగ్‌దళ్, మరో రెండు సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

ఓవైసీ వాయిస్... పేస్‌బుక్ పక్షపాతంతో వ్యవహరిస్తోంది... వారిపై చర్యలు చేపట్టేందుకు భయపడుతోంది...
Follow us on

ఫేస్‌బుక్‌పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి మండిపడ్డారు. ఫేస్‌బుక్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీని సంతృప్తి పరిచేందుకు భజరంగ్‌దళ్, మరో రెండు సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. అంతేకాకుండా మైనార్టీలపై దాడులు చేస్తున్న కొందరి అకౌంట్లను బీజేపీ మెప్పు కోసం ఫేస్‌బుక్, సోషల్ మీడియా సంస్థలు తొలగించడం లేదని ఆరోపించారు.

గతంలో అసదుద్దీన్ ఓవైసీ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. రాజాసింగ్ ఫేస్‌బుక్ ఐడీని బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ సోషల్ మీడియా నిబంధనలను పాటించడం లేదని, అయినా సోషల్ మీడియా సంస్థలు సంస్థలు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.