ఫేస్‌బుక్ లో సేఫ్టీ ఫీచర్.. అందుబాటులోకి ‘లాక్ ‌ప్రొఫైల్’..

| Edited By:

May 21, 2020 | 6:16 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో దిగ్గజ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కొత్తగా ‘లాక్‌ ప్రొఫైల్’

ఫేస్‌బుక్ లో సేఫ్టీ ఫీచర్.. అందుబాటులోకి ‘లాక్ ‌ప్రొఫైల్’..
Follow us on

Facebook Launches New Safety Feature: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో దిగ్గజ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కొత్తగా ‘లాక్‌ ప్రొఫైల్’ ఫీచర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. తమ స్నేహితుల జాబితాలో లేని వారు ఫేస్‌బుక్‌లోని తమ సమాచారాన్ని చూడకుండా ఈ ఫీచర్ రక్షిస్తుంది. తమ సమాచారంపై మరింత నియంత్రణ కోరుకునే వారికి ఈ ఫీచర్ అన్ని విధాలుగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా దేశంలోని మహిళల కోసం ఈ భద్రతా ఫీచర్‌ను రూపొందించారు.

కాగా.. ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌కు ఇది అదనపు భద్రతను జోడిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే స్నేహితులు కాని వారు వినియోగదారుల ప్రొఫైల్ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, జూమ్ చేయడం కాని కుదరదు. అలాగే, పాత, కొత్త పోస్టును కూడా ఫ్రెండ్స్ లిస్ట్‌లో లేనివారు చూడలేరు. త్వరలోనే ఈ ఫీచర్ ఫేస్‌బుక్ ఖాతాదారులందరికీ అందుబాటులోకి రానుంది.

Also Read: ఏపీలో మారిన రూల్స్.. కంటైన్మెంట్ జోన్ల పరిధి కుదింపు..