Facebook: కరోనావైరస్ నేపథ్యంలో.. ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం!

| Edited By:

Mar 04, 2020 | 5:17 PM

చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కరోనావైరస్‌ పై వచ్చే పుకార్లు, తప్పుడు కథనాలు, వదంతులపై యుద్ధం చేయడంలో సాయం చేయనుంది.

Facebook: కరోనావైరస్ నేపథ్యంలో.. ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం!
Follow us on

Facebook: చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కరోనావైరస్‌ పై వచ్చే పుకార్లు, తప్పుడు కథనాలు, వదంతులపై యుద్ధం చేయడంలో సాయం చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకోసం ఉచితంగా ప్రకటనలు ఇవ్వనుంది. వినియోగదారులు తప్పుడు సమాచారం బారిన పడకుండా ఈ చర్యలు తీసుకోనుంది. ఈవిషయాన్ని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

మరోవైపు, ” మేము మిగిలిన వారితో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరినన్ని వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధం. ఎవరైనా వైరస్‌పై సమాచారం కోసం వెతుకుతుంటే వారికి ఒక పాపప్‌ వస్తుంది. అది వారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, లేదా స్థానిక వైద్య అధికారుల సూచనలు ఉన్నచోటకి తీసుకెళుతుంది” అని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. తమ కంపెనీ తప్పుడు సమాచారాన్ని ఆన్‌లైన్‌ నుంచి తొలగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాటిని తొలగించే ఏర్పాట్లు చేస్తామని మార్క్‌ చెప్పారు.

కాగా.. వైద్యనిపుణులతో కలిసి ఫేస్‌బుక్‌ పనిచేస్తుందని, యాడ్‌క్రెడిట్స్‌ రూపంలో ఇతరులకు సహకరిస్తుందన్నారు. కరోనావైరస్‌ నుంచి రక్షణకు, వ్యాధి తగ్గించేందుకు ఆఫర్‌ చేసే తప్పుడు వాణిజ్యప్రకటనలను తొలగిస్తామని ఫిబ్రవరిలోనే ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 93వేల మందికి ఈ వ్యాధి సోకిన విషయం తెలిసిందే.